నల్లగొండ జిల్లా:ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, మీకు పాఠశాలలో,హాస్టల్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా తనకు తెలియజేయాలని మిర్యాలగూడ ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి విద్యార్థినిలకు సూచించారు.ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాచ్య తండాలోని తెలంగాణ ఆదర్శ బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులందరికీ నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే లక్ష్యంతో మెస్ చార్జీలు పెంచారన్నారు.విద్యార్థులు అందరూ మంచిగా తిని,మంచిగా చదువుకొని సమాజానికి,మీ తల్లితండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా ఉండాలన్నారు.
అలాగే ఆహారం విషయంలో గానీ,బుక్స్ విషయంలో గానీ,మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా,ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా తెలియజేయండి నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అనంతరం నిర్వాహకులతో మాట్లాడుతూ నిన్న అధికారులతో నిర్వహించిన తనిఖీల్లో నియోజకవర్గంలో ఉన్న అన్ని హాస్టల్స్ లో ఈ హాస్టల్ పైనే ఫిర్యాదులు వచ్చాయని, మరలా ఫుడ్ విషయంలో ఎలాంటి నాణ్యత రహితంగా ఉన్నట్టు విద్యార్థుల నుంచి గానీ,మేము సందర్శించినప్పుడు గానీ మాకు తెలిసినచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు
.