కులగణన చారిత్రాత్మక నిర్ణయం

సూర్యాపేట జిల్లా:బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసేలా కులగణన ప్రక్రియను చేపట్టడం హర్షణీయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, పెద్దిరెడ్డి రాజా అన్నారు.బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చొరవతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను చేపట్టి బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయటాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ,

 Caste Census Is A Historical Decision, Caste Census , Historical Decision, Congr-TeluguStop.com

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 52 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణించేలా కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని తెలిపారు.స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా,ఎన్నో ప్రభుత్వాలు మారినా సమాజంలో సింహభాగం ఉన్న బీసీలు వర్గాల్లో మార్పు లేదని,

వారు మరిన్ని పదవులు రిజర్వేషన్లు పొందేలా అభివృద్ధి చెందేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని చెప్పారు.

భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం తద్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న, ఎడ్లవీరమల్లు గంగాభవాని,శ్రీవిద్య జ్యోతి కరుణాకర్,మాజీ కౌన్సిలర్లు నిమ్మల వెంకన్న,తండు శ్రీనివాస్ గౌడ్,వల్దాస్ దేవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లల రమేష్ నాయుడు, నేరేళ్లమధు,ఫారూఖ్, బంటు చొక్కయ్య గౌడ్, యాట ఉపేందర్,ధర్మా, కరుణాకర్ రెడ్డి,సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube