కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీలో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వీ కర్ణన్

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్, ఎన్ హెచ్ ఎం డైరెక్టర్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు.తంగళ్ళపల్లి మండలం జిల్లెల, నేరెళ్ల, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల, పెద్ద బోనాల, ముష్టిపల్లిలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆర్ వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో  కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Joint District Special Officer Rv Karnan During Surprise Inspection Of Purchase-TeluguStop.com

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, తేమ శాతం సరిగ్గా ఉన్న ధాన్యం కాంటా వేసే విధానాన్ని పరిశీలించారు.అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆర్ వీ కర్ణన్ మాట్లాడారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు.ఆయా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.జిల్లాలో ఐకేపీ, మెప్మా, పీఏ సీ ఎస్, డీసీఎంఎస్ విభాగాల ఆద్వర్యంలో ఇప్పటికే 248 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.సీసీఐ ఆద్వర్యంలో దాదాపు ఐదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు.వరి, పత్తి పండించిన రైతులు తమ పరిధిలోని కేంద్రాలకు పంట ఉత్పత్తులను తరలించాలని సూచించారు.

స్టాంప్పింగ్ వేయాలి

కొనుగోలు కేంద్రాల నుంచి తరలించి ధాన్యం బస్తాలపై సెంటర్ పేరు సరిగ్గా కనిపించేలా ముద్ర వేయాలని ఆదేశించారు.ఆయా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాల పై వేసిన స్టాంపు లు పరిశీలించారు.రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముందుకు వచ్చే రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించాలని సూచించారు.

ఎవరూ ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయంగా ఉన్న గోదాములకు తరలించాలని ఆదేశించారు.రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.

ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాభాయ్, తంగళ్ళపల్లి తహసిల్దార్ జయంత్ కుమార్, మెప్మా డీఎంసీ రాజేశం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube