ఓటు వేసే విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొదించుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈవీఎం, వీవీప్యాట్‌ల ద్వారా ఓటు వేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు.పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ఈవీఎం, వీవీప్యాట్‌ల అవగాహన ప్రదర్శన కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్‌ ప్రారంభించారు.

 Everyone Should Be Educated About The Process Of Voting, Voting, Rajanna Sircill-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు, ఐడిఓసి లోని ప్రభుత్వ శాఖల కు వచ్చే ప్రజలకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్,ఎన్నికల విభాగం నాయబ్‌ తహసీల్దార్‌ పాషా, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube