కలుపు మొక్కల నివారణపై గ్రామస్తులకు అవగాహన..

రాజన్న సిరిసిల్ల జిల్లా:గ్రామీన వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బాబు జగ్జీవన్ రాం( Babu Jagjeevan Ram ) వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పర్యటిస్తూ వయ్యారి భామ అనే కలుపు మొక్క నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గ్రామంలో రైతులు పండిస్తున్న పంటల విధానంపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమకు తెలిసిన మెలకువలను రైతులకు,గ్రామస్తులకు వివరించడం జరుగుతుందన్నారు.

 Villagers Are Aware Of Weed Prevention , Villagers , Babu Jagjeevan Ram-TeluguStop.com

వయ్యారి భామ అనే కలుపు మొక్క అత్యంత సులభంగా వ్యాపించి ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుందన్నారు.ప్రజలపై, పశువుల ఆరోగ్యంపై దృష్ప్రభావం చూపుతుందన్నారు.

వయ్యారి భామ నివారణ చర్యలు గురించి రైతులకు, గ్రామస్తులకు తెలపడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు అల్లూరి రాజిరెడ్డి, వ్యవసాయ కళాశాల విద్యార్థులు మౌనిక, మనీష, అనూష, ధన్విక్ష,నహిద్ పర్విన్, మహిళలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube