పాడేమోసి మానవత్వాన్ని చాటుతున్న సర్పంచ్ వెంకన్నబాబు( Sarpanch Venkannababu ) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా అని భరోసా.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీలో రేసు బాబు అనే గ్రామపంచాయతీ కార్మికుడు గత ఐదు సంవత్సరాల నుండి ట్రాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇటీవల అనారోగ్యానికి గురైన బాబు నిన్న రాత్రి మరణించడం జరిగింది.ఇట్టి విషయం తెలుసుకున్న మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి బాబు మృదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి తన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటానని భరోసానిచ్చారు.
రేసు బాబు దహన సంస్కారాలు నిర్వహించగా స్వయంగా సర్పంచ్ వెంకన్న పాడేమోసి మానవత్వాన్ని చాటుకున్నాడు.ఈ సందర్భంగా బాబు గ్రామపంచాయతీకి , గ్రామ ప్రజలకు ట్రాక్టర్ డ్రైవర్ గా, గ్రామపంచాయతీ కార్మికుడిగా ఎన్నో సేవలు అందించాడని గుర్తు చేశాడు.