రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నృత్య కళానికేతన్ సేవాసంస్థ ప్రధాన కార్యాలయం నందు కళాకారుల సమావేశమునకు వ్యవస్థాపక అధ్యక్షులు యెల్ల పోశెట్టి అధ్యక్షత వహించగా అతిధులు సమాఖ్య గౌరవాధ్యక్షులు బొడ్డు రాములు, జిల్లాఅధ్యక్షులు సావనపల్లి శ్రీనివాస్,జిల్లాప్రధానకార్యదర్శి వారాల దేవయ్య, నృత్య కళానికేతన్అధ్యక్షులు మానువాడ లక్ష్మీనారాయణ,జోనల్ అధ్యక్షులు మారంప్రవీణ్, గౌరవాధ్యక్షులు సోమినేని బాలు,
కనపర్తి హనుమాండ్లు, గంగ శ్రీకాంత్ జిల్లా ప్రచారకార్యదర్శి పొందుర్తి ఉమేష్, సాంస్కృతిక కార్యకర్తలు దండు రాజమల్లయ్య,కొక్కుల రాజేశం, బొడ్డు నారాయణ, బీరవేణి బాగయ్య గరిగంటి చంద్రయ్య మామిండ్లసత్తయ్య, రాజమల్లు, రాజు తదితరులు పాల్గొన్నారు,ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ప్రార్థనగీతం తో పాటు కళాకారులు జానపద గేయాలు, రంగస్థలం పద్యాలు, గేయాలను ఆలపించారు అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు యెల్ల పోశెట్టి మాట్లాడుతూ తెలంగాణరాష్ట్రం సాధించేవరకు కళాకారుల ధూం ధాం ఆటపాటలతో ఎండనకా వాననక కష్టపడడంలో కళాకారులపాత్ర ఎంతో ఉందని అన్నారు.