బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిపల్లవి ప్రజెంట్ ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.‘ప్రేమమ్’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఈ భామ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘ఫిదా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో ‘భానుమతి’ పాత్రలో సాయిపల్లవి నటనకుగాను ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

మలర్ బ్యూటీ సాయిపల్లవి.సహజ నటనకు కేరాఫ్‌గా నిలుస్తుందని ప్రేక్షకులు అంటున్నారు.గ్లామర్ పాత్రలు కాకుండా సింపుల్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది సాయిపల్లవి.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది సాయిపల్లవి.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు చాలా భయమేసిందని చెప్పింది.తాను మొదటి సినిమాలో నటించేప్పుడు తన అందం గురించి ఎప్పడూ ఆలోచించేదాన్నని, తన ముఖానికి ఉన్న పింపుల్స్, మచ్చలు చూసి ప్రేక్షకులు తనను యాక్సెప్ట్ చేస్తారా? అనే అనుమానాలు తనకు ఉండేవని పేర్కొంది.గ్లామర్ ఫీల్డ్‌లో తాను అసలు రాణించగలనా? అనే డౌట్ ఎప్పటికీ తనను వెంటాడేదని, ఆ విషయమై చాలా సార్లు మానసికంగా బాధపడేదాన్నని తెలిపింది.ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటనే కామెంట్స్ వస్తాయోమేనని ఎప్పుడూ ఆందోళన చెందేదాన్నని సాయిపల్లవి పేర్కొంది.
అయితే, తాను మలయాళంలో నటించిన ‘ప్రేమమ్’ చిత్రం తర్వాత తనలో ఆత్మవిశ్వాసం చాలా పెరిగిందని చెప్పింది.తను ఆలోచించిన విధానం తప్పని అర్థం చేసుకున్నానని వివరించింది.అలా ‘ప్రేమమ్’ నుంచి ‘లవ్ స్టోరి’ వరకు కొనసాగిన సాయిపల్లవి జర్నీ.ఇంకా ముందుకు సాగుతూనే ఉంటుంది.
సాయిపల్లవి, నాగచైతన్య జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘లవ్ స్టోరి’ ఫిల్మ్‌లో సాయిపల్లవి నటనకుగాను మంచి మార్కులే పడ్డాయి.ఈమె నటించిన ‘విరాట పర్వం’ చిత్రం త్వరలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
ఇకపోతే సాయిపల్లవి నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.కోలకత్తా బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.