బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌజ్ మెట్స్.. ఎవరెవరంటే..!

బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదవ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఈ వారం ఆరుగురు హౌజ్ మెట్స్ నామినేట్ అవుతారని తెలుస్తుంది.

ఎపిసోడ్ టెలికాస్ట్ అవకముందే లీక్స్ బయటకు వస్తుండగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు.

హౌజ్ లో ఏం జరుగుతుంది అన్నది ముందే తెలిసిపోతుంది.ఈ క్రమంలో మండే ఎపిసోడ్ అయ్యాక గాని తెలియని నామినేటెడ్ హౌజ్ మెట్స్ ఎవరన్నది ఇప్పటికే లీక్ అయ్యింది.

ఈసారి జంటలుగా కన్ఫెషన్ రూం కు పిలిచి హౌజ్ మెట్స్ కు ఇంటి నుండి వచ్చిన లెటర్స్ ను వారికి ఇస్తే నామినేషన్స్ సేఫ్ అయినట్టు.వారికి ఇవ్వకుండా కట్టర్ లో వేస్తే వారు నామినేట్ అయినట్టు.

ఈ క్రమంలో ఈ వారం శ్రీరాం చంద్ర, రవి, సిరి, మానస్, షణ్ముఖ్, లోబో వీరు నామినేషన్స్ లో ఉన్నారు.అంటే వీరికి ఇంటి నుండి వచ్చిన లెటర్స్ అందలేదు అన్నమాట.

Advertisement

ఇందులో శ్రీరాం చంద్ర జశ్వంత్ కోసం సాక్రిఫైజ్ చేసినట్టు తెలుస్తుంది.సిరి కోసం షణ్ముఖ్ కూడా మరోసారి త్యాగం చేసినట్టు తెలుస్తుంది.

ప్రోమో చూస్తే కొద్దిగా ఈ నామినేషన్స్ ఎమోషనల్ గా ఉండేలా ఉన్నాయి.సోమవారం నామినేషన్స్ అంటే సాధారణంగా హాట్ హాట్ గా ఉంటుంది.

కాని ఈ మండే ఎపిసోడ్ కొద్దిగా ఎమోషనల్ గా ఉండబోతుందని ప్రోమో చూస్తేనే అర్ధమవుతుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు