బాడీలో కాల్షియం తగ్గితే చాలా డేంజర్.. మీలో ఈ లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..!

మన శరీరంలో ఉన్న ప్రతి భాగం కూడా చాలా ముఖ్యమైనది అనే చెప్పాలి.ఎందుకంటే శరీరంలోని ఏ అవయవం సరిగా పని చేయకపోయినా మనం అనారోగ్యం పాలవుతాము.

 These Are The Symptoms To Detect Calcium Deficiency In Your Body Details, Calciu-TeluguStop.com

ముఖ్యంగా మానవ శరీరంలో ఎముకలు ప్రత్యేక పాత్రను పోషిస్తాయి.మరి అలాంటి ఎముకలు దృఢంగా ఉండాలంటే తప్పనిసరిగా కాల్షియం చాలా అవసరం.

అలాగే ఈ కాల్షియం వలన ఎముకలు గట్టి పడడంతో పాటు కండరాలు  కూడా అభివృద్ధి చెందుతాయి.మరి ఎముకల దృఢత్వానికి అంతలా ఉపయోగపడే కాల్షియం సమపాళ్లలో లేకపోతే ఏమవుతుందంటే మన ఎముకలు బలహీనపడతాయి.

మన శరీరంలో ఉండే కాల్షియం లోపాన్ని హైపోకాల్సెమియా అంటారు.శరీరంలో క్యాల్షియం లోపించినప్పుడు క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు తింటూ ఉండాలి.

మరి శరీరంలో క్యాల్షియం లోపం ఉందని తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా.? ఒకవేళ ఈ క్రింద చెప్పబడిన లక్షణాలు కనుక మీలో ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.ఎప్పుడయితే శరీరంలో క్యాల్షియం లోపిస్తుందో అప్పుడు కండరాలు తిమ్మిరి అనేది వస్తుంది.మీ శరీరంలో హోమోగ్లోబిన్ అనేది తగిన స్థాయిలో ఉన్నప్పటికి కండరాల తిమ్మిరి, నొప్పులు కనుక వస్తుంటే అది కాల్షియం లోపం అని గుర్తుంచండి.

క్యాల్షియం మీ శరీరంలో తగిన మోతాదులో లేదని చెప్పడానికి మీ గోళ్లు ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు.గోళ్లు బలంగా, ఆరోగ్యకరంగా ఉండటానికి కాల్షియం అవసరం.

ఎప్పుడయితే గోళ్లు పెళుసుగా మారి బలహీనంగా ఉంటాయో అప్పుడు క్యాల్షియం లోపం అని తెలుసుకోండి.క్యాల్షియం లోపం వలన ఎముక సాంద్రత అనేది తగ్గిపోతుంది.ఫలితంగా ఎముకల వ్యాధి, ఎముకలను పగుళ్ల ప్రమాదం ఎక్కువ అవుతుంది.అలాగే క్యాల్షియం తక్కువగా ఎముకలతో పాటు దంతాలు కూడా బలహీనంగా తయారవుతాయి.అలాగే కాల్షియం లోపం ఉన్న కండరాల పనితీరు మందగిస్తుంది.ఫలితంగా ఆడవాళ్లు నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతారు.

పై లక్షణాలు కనుక మీలో ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడంతో పాటు కాల్షియం ఎక్కువగా ఉన్నా ఆహార పదార్ధాలు అయిన పాలు, పాల పదార్ధాలు, కోడి గుడ్లు, ఆకుకూరలు, బాదాం పప్పులు లాంటివి బాగా తింటే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube