ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో తీవ్రంగా సతమతం అయిపోతున్నారు.వీటి నుంచి బయటపడలేక కొందరైతే ప్రాణాలను కూడా విడుస్తున్నారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ టీని తీసుకుంటే గనుక చాలా అంటే చాలా సులభంగా ఆయా మానసిక సమస్యలను నివారించుకోవచ్చు.మరి ఆ టీ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే.అందులో ఒక స్పూన్ బ్లాక్ టీ పౌడర్, మూడు తులసి ఆకులు, పావు స్పూన్ మిరియాల పొడి, చిన్న దంచిన అల్లం ముక్క, అర స్పూన్ యాలకుల పొడి, చిన్న దాల్చిన చెక్క, పావు స్పూన్ సోంపు, చిటికెడు కుంకుమ పువ్వు, రెండు స్పూన్లు ఎండిన గులాబీ రేకులు, రెండు స్పూన్ల పటిక బెల్లం పొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు పోసి ఏడు నుంచి పది నిమిషాలు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకుంటే టీ సిద్ధమైనట్టే.ఈ టీని రోజుకు ఒక కప్పు చప్పున తీసుకుంటే.
అందులో ఉండే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలన్నీ పరార్ అవుతాయి.
అంతే కాదు, ఈ టీని తాగడం వల్ల మనసు, మెదడు ప్రశాంతంగా మారతాయి.
రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.మరియు ఈ టీని తాగితే తలనొప్పి నుంచి సైతం క్షణాల్లో ఉపశమనాన్ని పొందొచ్చు.