తెల్ల జుట్టుకు ఇంట్లోనే న్యాచురల్ గా రంగేయండిలా!

ఇటీవల రోజుల్లో 30 ఏళ్లకే ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మంది తెల్ల జుట్టు( White Hair ) సమస్యతో బాధపడుతున్నారు.తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం.

 This Home Remedy Helps To Reduce White Hair Details, White Hair, Home Remedy, B-TeluguStop.com

అందువల్ల ఏజ్ ను తగ్గించి యంగ్ గా కనిపించడానికి తెల్ల జుట్టును డైయింగ్ చేస్తూ ఉంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే కృత్రిమ రంగుల్లో ఎన్నో కెమికల్స్ నిండి ఉంటాయి.

ఇవి అనేక సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి.ఈ నేపథ్యంలోనే తెల్ల జుట్టుకు ఇంట్లోనే న్యాచురల్ గా ఎలా రంగు వేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Black, Care, Care Tips, Dye, Remedy, Latest, Natural Dye, White-Telugu He

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek Seeds ) వన్ టేబుల్ స్పూన్ నువ్వులు,( Sesame seeds ) నాలుగు రెబ్బలు కరివేపాకు మరియు వన్ టీ స్పూన్ పసుపు వేసి వేయించాలి.పూర్తిగా నల్లగా మారేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పసుపు, మెంతులు, నువ్వులు, కరివేపాకు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Black, Care, Care Tips, Dye, Remedy, Latest, Natural Dye, White-Telugu He

ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ లో మూడు టేబుల్ స్పూన్లు ఆవ నూనె, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధ‌రించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ విధంగా కనుక చేశారంటే తెల్ల జుట్టుకు న్యాచురల్ గానే చెక్ పెట్టవచ్చు.ఈ రెమెడీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.సహజంగా వైట్ హెయిర్ ను బ్లాక్ గా మారుస్తుంది.నల్లటి మెరిసేటి కురులను మీ సొంతం చేస్తుంది.

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.కాబట్టి తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారు ఇంట్లోనే న్యాచురల్ గా రంగు వేయండిలా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube