మధుమేహం ఉన్నవారు ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన మూడు కూరగాయలు ఇవే!

ఇటీవల రోజుల్లో మధుమేహం బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.ముప్పై ఏళ్ల వారు సైతం మధుమేహానికి గురవుతున్నారు.

 These Three Vegetables Very Healthy For Diabetic Patients! Vegetables, Diabetes-TeluguStop.com

ఇది దీర్ఘకాలిక వ్యాధి.ఒకసారి వచ్చిందంటే జీవితకాలం దానితో సావాసం చేయాల్సిందే.

అయితే మధుమేహం ఉన్నవారికి ఏం తినాలి? ఏం తినకూడదు? అన్న అవగాహన లేక చాలా సతమతం అవుతుంటారు.అయితే ఏం తిన్నా తినకపోయినా ఇప్పుడు చెప్పబోయే మూడు కూర కాయలు మాత్రం వారంలో ఒక్కసారైనా ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

మరి ఆ మూడు కూరగాయలు ఏంటి.వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

బెండకాయ..

( Ladies finger ) ఏడాది పొడవునా లభించే కూరగాయల్లో ఒకటి.మధుమేహులకు బెండకాయ ఒక వరం అని చెప్పవచ్చు.

బెండకాయను డైట్ లో చేర్చుకుంటే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.బెండకాయ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

ఇది మధుమేహాన్ని తగ్గించడానికి ఉత్తమంగా సహాయపడుతుంది.అదే సమయంలో గ్లైసెమిక్ నియంత్రణను ప్రోత్సహిస్తుంది.

ఇన్సులిన్ ను కూడా మెరుగుపరుస్తుంది.అందుకే మధుమేహం ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండు సార్లు అయినా బెండకాయను తీసుకోవాలి.

Telugu Beetroot, Bitter Gourd, Diabetes, Diabetic, Tips, Finger, Latest, Okra, V

మధుమేహుల‌కు మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ ( Bitter gourd )ఒకటి.కాకరకాయ చేదుగా ఉన్న ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా మధుమేహుల‌కు కాకరకాయ సూపర్ ఫుడ్.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.అలాగే రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.వెయిట్ లాస్ కు హెల్ప్ చేస్తుంది.

జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.

Telugu Beetroot, Bitter Gourd, Diabetes, Diabetic, Tips, Finger, Latest, Okra, V

ఇక మధుమేహం ఉన్నవారు ఖచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో బీట్ రూట్ ( Beetroot )ఒకటి.మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో చాలామంది బీట్ రూట్ తియ్యగా ఉంటుందని అవాయిడ్ చేస్తుంటారు.బీట్‌రూట్ సహజ చక్కెరను కలిగి ఉంటుంది.కాబట్టి ఇది మీ శరీరానికి హాని కలిగించదు.మధుమేహుల‌కు బీట్ రూట్‌ చక్కని పోషకాహారం.బీట్ రూట్ ను డైట్ లో చేర్చుకుంటే.

అది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.రక్తహీనతను దూరం చేస్తుంది.

నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.అతి ఆకలిని సైతం నివారిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube