సూర్య క్రేజీ లుక్ తో 'కంగువ' గ్లింప్స్ అప్డేట్.. పోస్టర్ అదిరిందిగా..

కోలీవుడ్ హీరోల్లో అద్బుతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న సెన్సేషనల్ హీరోల్లో సూర్య ( Suriya ) ఒకరు.ఈ మధ్య కాలంలో సూర్య నటిస్తున్న అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి.

 Kanguva Official New Poster Glimpse On July 23, Kanguva Glimpse, Kanguva, Suriya-TeluguStop.com

దీంతో ఈయన సినిమాలపై మరింత హైప్ ఏర్పడుతుంది.ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో ”కంగువ” (Kanguva) సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.సూర్య సినిమాల కోసం తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు.

అందుకే ఇప్పుడు చేస్తున్న కంగువ సినిమా మీద కూడా భారీ హైప్ పెరిగింది.ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

“/>

ఈ సినిమా నుండి ఫస్ట్ టీజర్ గ్లింప్స్ ( Kanguva Glimpse ) కోసం ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు.మరి ఎట్టకేలకు ఈ రోజు మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.సూర్య క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ మూవీ గ్లింప్స్ అప్డేట్ ఇచ్చారు.జులై 23న సూర్య బర్త్ డే కానుకగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఇక ఈ పోస్టర్ లో కేవలం సూర్య చేతిని మాత్రమే చూపించగా ఆయన చేతిపై ఉన్న టాటూలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

ఇక ఈ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది.గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు టాక్.

కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube