సూర్య క్రేజీ లుక్ తో ‘కంగువ’ గ్లింప్స్ అప్డేట్.. పోస్టర్ అదిరిందిగా..

కోలీవుడ్ హీరోల్లో అద్బుతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న సెన్సేషనల్ హీరోల్లో సూర్య ( Suriya ) ఒకరు.

ఈ మధ్య కాలంలో సూర్య నటిస్తున్న అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి.

దీంతో ఈయన సినిమాలపై మరింత హైప్ ఏర్పడుతుంది.ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో ''కంగువ'' (Kanguva) సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.సూర్య సినిమాల కోసం తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు.

అందుకే ఇప్పుడు చేస్తున్న కంగువ సినిమా మీద కూడా భారీ హైప్ పెరిగింది.

ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

"""/" /"/> ఈ సినిమా నుండి ఫస్ట్ టీజర్ గ్లింప్స్ ( Kanguva Glimpse ) కోసం ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు.

మరి ఎట్టకేలకు ఈ రోజు మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.సూర్య క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ మూవీ గ్లింప్స్ అప్డేట్ ఇచ్చారు.

జులై 23న సూర్య బర్త్ డే కానుకగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఇక ఈ పోస్టర్ లో కేవలం సూర్య చేతిని మాత్రమే చూపించగా ఆయన చేతిపై ఉన్న టాటూలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

"""/" / ఇక ఈ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది.

గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు టాక్.

కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఏందిది.. ఈ బాలుడు 9/11 తీవ్రవాద దాడిలో మరణించి.. మళ్లీ పుట్టాడట..!