డార్క్ సర్కిల్స్.ఎందరినో కలవర పెట్టే చర్మ సమస్య ఇది.
ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఆహారపు అలవాట్లు, హార్మోన్ ఛేంజస్, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, తరచూ స్మార్ట్ ఫోన్లతోనే గడపటం, కెమికల్స్ అధికంగా ఉండే ఐ మేకప్ ప్రోడెక్ట్స్‌ను వాడటం వంటి రకరకాల కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.
వీటి వల్ల ముఖ సౌందర్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.
అందుకే అందానికి అడ్డంగా మారిన డార్క్ సర్కిల్స్‌ను వదిలించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇకపై నో టెన్షన్.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే కేవలం పది రోజుల్లోనే డార్క్ సర్కిల్స్‌ను వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ బంగాళదుంప జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ కీర జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, చిటికెడు ఆర్గానికి పసుపు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఏదైనా బ్రష్ సాయంతో తయారు చేసుకున్న మిశ్రమాన్ని కళ్ళ కింద మరియు పైన అప్లై చేసుకుని ఓ ఇరవై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.ఆ తర్వాత కాస్త చల్లగా ఉన్న వాటర్ తో శుభ్రంగా కళ్ళను క్లీన్ చేసుకుని.ఏదైనా మాయిశ్చరైజర్ లేదా సీరమ్‌ను అప్లై చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేశారంటే డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గిపోతాయి.ఎవరైనా నల్లటి వలయాలతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి.