ఆ నోట్లను రద్దు చేయాలంటున్న చంద్రబాబు

టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ( AP CM Chandrababu )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాజాగా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు దేశంలో అవినీతి తగ్గాలంటే 500 , 200 నోట్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు.

 Cm Chandrababu Wants To Cancel Those Notes, Chandrababu, Cbn, Tdp, Janasena, Ch-TeluguStop.com

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని , పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు .బ్యాంకులు 100% డిజిటల్ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు చంద్రబాబు సూచించారు.అలాగే ఏపీలో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బ్యాంకులు పనిచేయాలని చంద్రబాబు సూచించారు . కౌలు రైతులకు కూడా రుణాలు సులభంగా అందించే పరిస్థితి రావాలని అన్నారు .దీనికోసం బ్యాంకులు ప్రభుత్వం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్టేట్ లెవెల్ బ్యాంకర్స కమిటీ సమావేశంలో అన్నారు .

Telugu Ap, Chandrababu, Janasena, Rbi, Ysrcp-Politics

వ్యవసాయానికి ఇవ్వండి కవులు రైతులకు రుణాలు సులభతరం చేయండి అంటూ బ్యాంకర్లను చంద్రబాబు కోరారు.సంపద సృష్టించే రంగాలకు బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు .ఐదు రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, బ్యాంకర్లు , నిపుణులతో జరిగిన భేటీలో చంద్రబాబు పాల్గొన్నారు.చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది .2024 – 25 ఆర్థిక సంవత్సరానికి 5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు.రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1, 65,000 కోట్ల ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికను రూపొందించారు.వ్యవసాయ రంగానికి 2,64, 000 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

డైరీ , పౌల్ట్రీ, ఫిషరీస్ , వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు 32,600 కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించారు.ఈ సందర్భంగా గత వైసిపి ప్రభుత్వ పాలనపైన విమర్శలు చేశారు.

Telugu Ap, Chandrababu, Janasena, Rbi, Ysrcp-Politics

గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అన్ని వ్యవస్థలు కుదేలు అయ్యాయని చంద్రబాబు మండిపడ్డారు.వాటిని గాడిలో పెట్టేందుకు మరికొంత సమయం పడుతుందని , కీలక అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మంత్రులు , బ్యాంకర్లు, నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు.ఈ మేరకు ఐదు అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసేందుకు ఈ కమిటీ పని చేస్తుందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube