పేదల భూములు లాక్కోవొద్దు: పల్లా వెంకట్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 225 సర్వే నెంబరు గల పేదల భూములను పోలీసు బెటలియానికి కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిపిఐ జాతీయ కౌన్సిలర్ సభ్యులు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు.శనివారం ఆయన పార్టీ కార్యకర్తలు,రైతులతో కలిసి సంబంధిత పేదల భూముల్లో పర్యటించి పరిశీలించారు.

 Dont Grab The Lands Of The Poor Palla Venkat Reddy, Lands , Poor, Palla Venkat-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్న పేదల జీవితాలపై కారం చల్లి,రైతుల పొట్ట కొట్టడం సరైన చర్య కాదన్నారు.గతంలో తాను మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గిరిజనుల రైతులకు కొంత వరకు పట్టాలివ్వడం జరిగిందని,

తరువాత ప్రభుత్వాలు మారుతున్నా కొద్ది చిన్నగా అందరికి పట్టాలు అందే సమయానికి ఇలా రైతుల భూములపై కన్నేయడం ఏంటని మండిపడ్డారు.

తక్షణమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు,నెల్లికంటి సత్యం, బచ్చనగాని గాలయ్య యాదవ్,కురిమిద్దె శ్రీనివాస్, దుబ్బాక భాస్కర్,శేఖర్ రెడ్డి, చిలివేరు అంజయ్య,రైతులు మెగావత్ నర్సింహ,జలందర్, నర్సింహ,అంజయ్య,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube