నేరేడు పండ్ల‌ను ఇలా తింటే రిస్క్‌లో ప‌డ్డ‌ట్టే..జాగ్ర‌త్త‌!

వ‌ర్షాకాలంలో విరి విరిగా ల‌భించే పండ్ల‌లో నేరేడు పండ్లు ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.పులుపు, వగరు, తీపి మేళవింపు రుచులతో ఉండే నేరేడు పండ్ల‌ను పిల్ల‌లే కాదు.

 Side Effects Of Eating Jamun Fruit Overly! Side Effects Of Jamun Fruit, Jamun Fr-TeluguStop.com

పెద్ద‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు.పైగా నేరేడు పండ్ల‌లో ఆరోగ్యానికి మేలు చేసే విట‌మిన్ బి, విట‌మిన్ సి, ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్ప‌ర‌స్‌, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.

అందుకే చాలా మంది ధ‌ర ఎక్కువైనా నేరేడు పండ్ల‌ను కొనుగోలు చేసి.డైట్‌లో చేర్చుకుంటుంటారు.

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసి న‌ప్ప‌టికీ.నేరేడు పండ్ల‌ను ప‌రిమితికి మించి తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ముఖ్యంగా నేరేడు పండ్ల‌ను అతిగా తీసుకుంటే.అందులో ఉండే విట‌మిన్ సి మ‌ల‌బ‌ద్ధ‌కం ఏర్ప‌డేలా చేస్తుంది.

అందులోనూ మ‌ల‌బ‌ద్ధ‌కం ఉన్న వారు నేరేడు పండ్ల‌ను తీసుకుంటే స‌మ‌స్య మ‌రింత ఎక్కువ అవుతుంది.మ‌రియు ఇత‌ర గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వేధిస్తాయి.

నేరేడు పండ్లు తీసుకుంటే.ర‌క్త పోటు స్థాయిలు త‌గ్గుతాయి.అందుకే హై బీపీతో బాధ ప‌డే వారు నేరేడు పండ్లు తీసుకుంటే మంచిద‌ని అంటారు.అయితే నేరేడు పండ్లును ఓవ‌ర్ గా తింటే మాత్రం లో బీపీ స‌మ‌స్య వ‌చ్చే రిస్క్ పెరుగుతుంది.

అలాగే ఆస్త‌మాతో ఇబ్బంది ప‌డే వారు నేరేడు పండ్ల‌ను ఎంత త‌క్కువ తీసుకుంటే అంత మంచిది.లేదంటే ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి.అంతేకాదు, నేరేడు పండ్ల‌ను అధిక మొత్తంలో తీసుకోవ‌డం వ‌ల్ల గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌.

ఇక నేరేడు పండ్ల‌ను ప‌రిమితికి మించి తిన‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

ముఖ్యంగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటివి బాధిస్తుంటాయి.కాబ‌ట్టి, టేస్ట్ బాగున్నాయ‌నో, ఆరోగ్యానికి మేల‌నో అతిగా మాత్రం నేరేడు పండ్ల‌ను తీసుకోకండి.

లిమిట్‌గా తింటేనే హెల్త్‌కు మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube