అప్రమత్తంగా ఉండండి: జిల్లా కలెక్టర్ల సమావేశంలో సిఎస్ శాంతి కుమారి

హైదరాబాద్: జులై 20 ఉత్తర తెలంగాణాలోని 11 జిల్లాలలో ఈ నెల 20, 21 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.ఇవ్వాళ, రేపు11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ను ప్రకటిం చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో ఈరోజు సమా వేశం నిర్వహించారు ఈ సందర్బంగా సి.

 Be Vigilant Cs Shanti Kumari At District Collectors Meeting, Vigilant ,cs Shanti-TeluguStop.com

ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.

పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం,కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో ఇవ్వాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు.

ఈ సందర్భంగా ఈ జిల్లా లకు చెందిన కలెక్టర్లు ఏవిధ మైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పా టు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ 11 జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారుల తో సమన్వయ సమావేశా లు నిర్వహించాలని తెలియచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube