రాజన్న సిరిసిల్ల జిల్లా : భారత దేశ మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం ప్రతిజ్ఞ చేసి నివాళ్ళు అర్పించిన జిల్లా ఎస్పీ , పోలీస్ అధికారులు, సిబ్బంది.
అనంతరం ఎస్పీ మాట్లాడారు… సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత స్వాతంత్ర్య పోరాటం, భారతదేశ నిర్మాణంలో అందించిన సేవలను కొనియాడారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ పోరాటమే ఊపిరిగా సాగిన ప్రస్థానం దేశ సమగ్రత కోసం శ్రమించిన ధీరత్వం,అప్పుడే స్వతంత్రం వచ్చిన పసిగుడ్డు లాంటి దేశాన్ని ఒంటిచేత్తో ఏకం చేసి దేశ విభజనతో జాతి గుండెకు గాయమైన వందలాది సంస్థలను ఒక్కటి చేసిన మహనీయుడికి ఘననివాళి,
యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబంలో జీవిస్తూ జాతి సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళి అవుతుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ,రూరల్ సి.ఐ లు కృష్ణ, మొగిలి, ఆర్.ఐ యాదగిరి, ఆర్.ఎస్.ఐ శ్రవణ్ యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.