రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) రుద్రంగి మండల కేంద్రంలో గురువారం రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వైయస్ రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి( YSR ) సేవలు మరువలేనివని, పేదవాడిని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డిది అన్నారు.
అతడు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని,అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి చేలుకల తిరుపతి, మండల బిసి మోర్చా అధ్యక్షుడు గండి నారాయణ( Gandi Narayana ), నాయకులు మాడిశెట్టి అభిలాష్, సూర యాదయ్య, సర్గం పరంధాములు, పూదరి మహిపాల్, ఇప్ప మహేష్ , దయ్యాల శ్రీనివాస్, సనుగుల గంగాధర్ ,గండి అశోక్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.