ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీనీ సోమవారం రోజున చేపట్టారు.ఈ సందర్భంగా జన విజ్ఞన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుదమని , ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు.

 Janavignana Vedika Sampathi Ramesh About Importance Of Vote, Janavignana Vedika,-TeluguStop.com

ఇది వ్యక్తి అస్తిత్వానికి, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది.

కావున డబ్బుకు, మద్యానికి ఓటును అమ్ముకోవద్దని, ప్రజాస్వామ్యంలో మన భవిష్యత్తును మార్చుకోవడానికి ఓటు అనేది కీలకమైనది.

ప్రతి ఒక్కరు ప్రలోభాలకు లొంగకుండా నిజమైన నాయకున్ని ఎన్నుకోవాలి.అప్పుడే మన జీవితాలలో మార్పు వస్తుందనీ అన్నారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మండల కన్వీనర్ సావనపల్లి రవి, కాసుపాక శంకర్, సావనపల్లి రాములు, గొట్టుముక్కల చక్రపాణి, కోలమద్ది పరశురాములు తెలంగాణ శ్రీనివాస్,వెలిచాల స్కైలాబ్, అంతటి తిరుపతి ,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube