నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోప్పందండి నియెజకవర్గ పరిధిలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి సందర్శించి పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు జిల్లా ఎస్పీ ని అడిగి తెలుసుకున్నారు.గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే ఎన్నికల నేరస్థులపై, రౌడీ షీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని,విలేజ్ పోలీస్ అధికారి తరచు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా కృషి చేయడం జరుగుతుందని,క్రిటికల్ గ్రామాల్లో సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కల్పించడం జరిగిందని జిల్లా ఎస్పీ కరీంనగర్ పోలీస్ పరిశీలకులకు వివరించారు.

 Strong Arrangements For Conduct Of Fair Elections, Boinpalli Police Station, Tel-TeluguStop.com

అనంతరం జిల్లా ఎస్పీ బోయినపల్లి స్టేషన్ పరిధిలో ఉన్న క్రిటికల్ పొలింగ్ స్టేషన్స్ వివరాలు అడిగి తెలుసుకిని,క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అయిన విలసాగర్, నిలోజ్పల్లి, కొదురుపాక గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్ సందర్శించి వాటి వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, బారికేడ్లు, మొదలగు భద్రత అంశాల మీద అధికారులకు సూచనలు చేశారు.కొదురుపాక వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి ఎన్నికలను పారదర్శకం గా నిర్వహించేందుకు నగదు, బంగారం, ఇతరత్రా కానుకల పంపిణీ చేసే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు లేకుండా భారీ ఎత్తున నగదు, బంగారం వంటివి తరలిస్తే వెంటనే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలన్నారు.ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ కృష్ణకుమార్, సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube