తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం తీసుకొస్తామని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ అవునూరు దయాకర్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2024-2026 సంవత్సరానికి గాను సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 Sirisilla Constituency Incharge Of Telugu Desam Party Is Avunuri Dayakar Rao , A-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ వంచ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు1982 లో అన్న ఎన్టీఆర్ బడుగు,బలహీన వర్గాల రాజకీయ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని ప్రజలకు ఎన్టీఆర్ ,చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎన్నో పథకాలను అందించి అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో వీర్నపల్లి మండలంలో అత్యధిక సభ్యత్వాలను నమోదు చేయించి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వీర్నపల్లి మండల మాజీ అధ్యక్షుడు పెడ్తనపెళ్లి రాములు, ఎల్లారెడ్డిపేట మండల మాజీ అధ్యక్షుడు చేట్కూరి నారాయణ గౌడ్,జిల్లా నాయకులు మాలోత్ సూర్యనాయక్, అబ్బనవేణి ఆశయ్య, గొల్లపెల్లి రాజాం, గొల్లపల్లి లక్ష్మీ, గొల్లపల్లి మమత, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube