ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు చాలా లక్కీ.. పెళ్లయ్యాక భర్తకు..?

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం రాశులు, గ్రహాల కదిలికలు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చెప్పవచ్చు.గ్రహాల కదిలికలు అన్ని రాశులపై శుభ, అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయి.

 Girls Born On These Dates Are Very Lucky For Husband After Marriage , Astrology-TeluguStop.com

అయితే జ్యోతిష్య శాస్త్రంలో కూడా వీటన్నిటిని ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.అదే సమయంలో న్యూమరాలజీ ( Numerology )అనేది జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైన భాగం అని నిపుణులు చెబుతున్నారు.

న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి వ్యక్తి స్వభావం, ప్రవర్తన, భవిష్యత్తు గురించి చెప్పవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.సంఖ్యా శాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంలో ఒడిదుడుకులతో పాటు భవిష్యత్తులో జరగబోయే విషయాలను జనన సంఖ్య ఆధారంగా చెప్పవచ్చు.

Telugu Astrology, Number, Numerology, Planet-Telugu Bhakthi

ఉదాహరణకు నెలలో రెండు, పదకొండు లేదా 20 తేదీలలో జన్మించిన మహిళల వ్యక్తిత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ తేదీలో పుట్టిన మహిళలు న్యూమరాలజీ ప్రకారం జీవిత భాగస్వామికి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా చాలా అదృష్టన్ని తెస్తారు.ఇంకా చెప్పాలంటే రెండు సంఖ్య ఉన్న మహిళలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు.ఈ మహిళలకు( women ) ఎప్పుడూ కలిసి వస్తుంది.ఈ మహిళలు భాగస్వామికి అదృష్టాన్ని తెస్తారు.అంతే కాకుండా భర్తను చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు.

భర్త ఉన్నత స్థాయికి చేరుకుంటాడు.అంతేకాకుండా రెండు జననా సంఖ్య( Birth Number ) గల మహిళలు స్వతహాగా చాలా ఎమోషనల్ గా ఉంటారు.

Telugu Astrology, Number, Numerology, Planet-Telugu Bhakthi

వీరి భాగస్వామ్యంలో త్వరగా భావద్వేగ బంధాలను ఏర్పరచుకుంటారు.ఈ కారణంగా వీరు తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు.అలాగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఈ స్వభావం వల్ల చాలా సార్లు చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ ఉంటారు.ఈ అమ్మాయిలకు సంబంధాలను ఎలా నిర్వహించాలో బాగా తెలుసు.అందుకే అత్తమామలు వారిని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు.

అంతే కాకుండా అత్తవారింట్లో ఆమెకు మంచి కోడలు అనే పేరు కూడా ఉంటుంది.ఈ జనన సంఖ్య రెండు గల మహిళలకు బంధాన్ని సంబంధాన్ని ఎలా కొనసాగించాలో బాగా తెలుసు.

అందుకే వీరిని అదృష్టవంతులుగా భావిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube