పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేగంగా సినిమాలలో నటించడం లేదు.పొలిటికల్ కార్యక్రమాలతో పవన్ బిజీ అవుతుండటంతో పవన్ సినిమాల షూటింగ్ లు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి.
సుజిత్ సినిమాకు పవన్ కళ్యాణ్ ఏకంగా 75 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.ఈ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం.
ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారని సమాచారం అందుతోంది.సుజిత్ మాత్రం ఈ సినిమాకు పరిమితంగా పారితోషికం తీసుకుంటున్నారు.దాదాపుగా 170 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ప్రభాస్, బన్నీ, చరణ్, తారక్ రేంజ్ లో పవన్ కూడా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

ఆర్.ఆర్.ఆర్ సినిమాతో వచ్చిన లాభాలతో దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా కథ విషయంలో దానయ్య పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ ఉన్నారని సమాచారం అందుతోంది.
ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులకు భారీ మొత్తంలో ఆఫర్లు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ పెరగడంతో ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.

పవన్ సుజిత్ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.ఈ సినిమాలో పవన్ కనిపించే సీన్లు తక్కువేనని సమాచారం.రోజుకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో పవన్ కళ్యాణ్ కు పారితోషికం దక్కుతోంది.పవన్ వరుస ప్రాజెక్ట్ లను ప్రకటిస్తూ ప్రేక్షకులకు సంతోషాన్ని కలిస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.







