రేపటితో 'ఓజి' షెడ్యూల్ పూర్తి.. మళ్ళీ అప్పటి నుండే కొత్త షెడ్యూల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘‘ఓజి”.ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Pawan Kalyan Sujeeth Og Shoot Update, Director Sujeeth, Og Movie, Pawan Kalyan,-TeluguStop.com

పవన్ స్టార్ వెరీ పవర్ఫుల్ పాత్రలో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి.

అందులోను పవన్ ఈ సినిమాను అన్నిటికంటే ఇంట్రెస్ట్ పెట్టి చేయడం కూడా ఫ్యాన్స్ అంచనాలు పెంచాయి.

ఈ సినిమాలో కంటెంట్ ను మాత్రం బలంగా ఉందని నమ్ముతున్నారు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ ( Priyanka Mohan )హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ కుర్ర హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టడంతో ఈ పెయిర్ ఎలా ఉంటుందా అనే ఉత్సాహం కూడా అందరిలో ఉంది.

అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా. డివివి దానయ్య( D.V.V.Danayya ) డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పొలిటికల్ టూర్ లో బిజీగా ఉన్నారు.దీంతో పవన్ లేని పోర్షన్ ను సుజీత్ ముంబైలో తెరకెక్కిస్తున్నాడని సమాచారం.

ఈ షెడ్యూల్ రేపటితో పూర్తి అవుతుందట.దీంతో నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆరా స్టార్ట్ అయ్యింది.

మరి అందుతున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ షెడ్యూల్ జులై 9 తర్వాత స్టార్ట్ చేయనున్నారట.మరి పవన్ వారాహి యాత్రలో ఉండడంతో నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోన లేదంటే మంగళగిరిలో నిర్వహిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.మరి సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube