భారత వ్యతిరేకతను ఆయుధంగా పెట్టుకొని ఎన్నికలలో గెలిచి లగ్జరీ లను ఎంజాయ్ చేసే పాకిస్తాన్ ప్రధానమంత్రులలో ఇమ్రాన్ ఖాన్ చివరి వ్యక్తిగా మారనున్నాడని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దానికి తగినన్ని కారణాలు చెబుతున్నారు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
పాకిస్తాన్ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ముందున్న ప్రధాన మంత్రి లాగే భారత్ పైకి టెర్రరిజాన్ని ఎగదోసే ప్రయత్నం చేశాడు.కాని దీన్ని మోడీ ప్రధానిగా ఉన్న ఇండియా అసలు అంగీకరించలేదు అందుకే టెర్రరిజం కోరలను పీకడానికి రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ ను నిర్వహించింది.
అలాగే భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం కాదని ఉగ్రవాదాన్ని తయారుచేస్తున్న దేశమని అంతర్జాతీయ స్థాయిలో సాక్ష్యాధారాలతో నిరూపించింది.దీంతో పాపం పాకిస్థాన్ ఎఫ్.ఏ.టి.ఎఫ్ గ్రే లిస్ట్ లో చేరింది.ఈ దెబ్బతో పాకిస్తాన్ కి అప్పులు దొరకడం, సహాయాలు రావడం వంటివి నిలిచిపోయాయి.
దీనితో ప్రభుత్వం ఉగ్రవాదులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి చేరింది.డబ్బులు ప్రభుత్వం నుండి రాకపోవడంతో ప్రభుత్వాన్ని బెదర వేయాలని ఉగ్రవాదులు ఈమధ్య పాకిస్థాన్ లోనే బాంబులు పేలుస్తున్నారు.
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం, అక్కడి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైన సైనిక పప్పెట్ ఇమ్రాన్ ఖాన్.ఇప్పుడు ఉగ్రవాదుల చేతిలో తమ ప్రాణాలను పెడుతున్నారని ప్రజలు అర్థం చేసుకోవడంతో భారత వ్యతిరేకతను పక్కనపెట్టి అభివృద్ధి దిశగా పాకిస్తాన్ ని మారుస్తామని సైనిక ప్రభుత్వమైనా ఇమ్రాన్ సర్కారుపై తిరుగుబాటు చేస్తున్న ప్రతిపక్షాలతో జట్టు కడుతున్నారు.
భారత్ మీద కోపంతో అయినా తమకు అప్పులిచ్చి ఆదుకుంటుంది అనుకున్న చైనా వడ్డీ విషయంలో అసలు తగ్గకపోవడం, అంతర్జాతీయ సంస్థలు పాకిస్తాన్ కి డబ్బులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఇమ్రాన్ సర్కార్ తలలు పట్టుకుంది.
సరిగ్గా ఇలాంటి టైం లో అభివృద్ధి అస్త్రాన్ని ప్రజల ముందుంచి తమను గెలిపించండి అని ఒక్కటైన ప్రతిపక్షాలను చూస్తున్న పాకిస్తాన్ సైన్యం భారత్ పై వ్యతిరేకతను పాకిస్తాన్ ప్రజలు పక్కన పెడుతున్నారని గమనించింది.
ఇలా జరిగితే తమ చెప్పు చేతులనుండి అధికారం పూర్తిగా ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోతుందని, ఇది ఎలాగైనా అడ్డుకోవాలని కొత్త కొత్త వ్యూహాలు రచిస్తోంది మరి అవి ఏ ఫలితాన్ని ఇస్తాయో వేచి చూద్దాం.