ఇటీవల రోజుల్లో చాలా మంది రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టక తీవ్రంగా సతమతం అవుతున్నారు.దీన్నే నిద్రలేమి అని అంటారు.
ఆహారపు అలవాట్లు, వయసు పైబడటం, పలు దీర్ఘకాలిక వ్యాధులు, ఒత్తిడి, డిప్రెషన్ తదితర కారణాల వల్ల కంటి మీద కునుకు లేకుండా పోతుంటుంది.సరైన నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి.
అందుకే ఎక్కువ శాతం మంది నిద్ర పట్టడం కోసం మందులు వాడుతుంటారు.కానీ సహజంగా కూడా నిద్రలేమి సమస్య ( Insomnia problem )నుంచి బయటపడవచ్చు.

ముఖ్యంగా అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.నైట్ ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎలాంటి మందులు వాడక్కర్లేదు.ప్రశాంతమైన మరియు సుఖమైన నిద్ర మీ సొంతం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో అర అంగుళం దంచిన అల్లం ముక్కను( ginger ) వేసుకోవాలి.అలాగే నాలుగు లవంగాలు( cloves ), హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ), రెండు రెబ్బల ఫ్రెష్ కరివేపాకు వేసి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

రోజు నైట్ ఈ డ్రింక్ ను తీసుకుంటే నిద్రలేమి దెబ్బకు పరార్ అవుతుంది.నాణ్యమైన నిద్ర మీ సొంతం అవుతుంది.కాబట్టి ఇకపై నిద్ర పట్టడానికి మందులు వాడటం మానేసి ఈ డ్రింక్ ను తీసుకోవడానికి ప్రయత్నించండి.ప్రశాంతంగా నిద్రించండి.
పైగా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.
మలబద్ధకం సమస్య దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.ఉదయానికి చర్మం గ్లోయింగ్ గా మెరుస్తుంది.
మరియు జుట్టు రాలడం సైతం కంట్రోల్ అవుతుంది.