కొబ్బరి నూనె( coconut oil ).దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
చాలా మంది వంటలకు కొబ్బరి నూనెను వాడుతుంటారు.కొబ్బరి నూనెలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.
అవి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే కురుల సంరక్షణకు సైతం కొబ్బరి నూనె అండగా నిలుస్తుంది.
కానీ ఎక్కువ శాతం మంది కొబ్బరి నూనెను సరైన పద్ధతిలో ఉపయోగించలేకపోతుంటారు.నిజానికి ఎలాంటి జుట్టు ( hair )సమస్యలకైనా కొబ్బరి నూనెతో సులభంగా చెక్ పెట్టవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం కొబ్బరి నూనెను ఏయే సమస్యకు ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్ ఫాల్( Hair fall ) అనేది దాదాపు అందరిలోనూ చాలా కామన్ గా కనిపించే సమస్య.
అయితే ఈ సమస్యను నివారించడానికి కొబ్బరినూనె ఉత్తమంగా సహాయపడుతుంది.అందుకోసం మిక్సీ జార్ లో మూడు టేబుల్ స్పూన్లు నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు ( Fenugreek )వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ మెంతుల పేస్టులో ఐదు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా అదుపులోకి వస్తుంది.

అలాగే హెయిర్ గ్రోత్ ను పెంచడానికి కొబ్బరి నూనె బాగా సహాయపడుతుంది.అందుకోసం ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, రెండు చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్లకు పట్టించి కనీసం 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఇలా చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.
హెయిర్ గ్రోత్ రెట్టింపు అవుతుంది.

చుండ్రు సమస్యను నివారించడానికి కూడా కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది.అందుకోసం ఒక బౌల్లో నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, మూడు టేబుల్ స్పూన్లు లెమన్ చూసి వేసుకుని కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు బాగా పట్టించి గంట అనంతరం హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఇలా చేస్తే చుండ్రు దెబ్బకు పరారవుతుంది.

జట్టు షైనీ గా మెరిసిపోవాలంటే మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి జుట్టు మొత్తానికి అప్లై చేయాలి.గంట తర్వాత తల స్నానం చేయాలి.ఇలా చేస్తే కురులు షైనీ గా మెరుస్తాయి.
ఇక ఒక బౌల్ లో ఒక ఎగ్ వైట్ మరియు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని చిట్లిన జుట్టుకు అప్లై చేసి రెండు గంటల అనంతరం షాంపూ చేసుకోవాలి.
ఇలా చేస్తే చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.