పిడి, పిఈటిలకు యోగా శిక్షణ ముగింపు కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా: జడ్పీహెచ్ఎస్ నెహ్రూ నగర్ లో జిల్లాలోని పిడి, పిఈటిలకు 20 తేదీ నుండి 25 వరకు యోగ శిక్షణ ముగింపు కార్యక్రమం చేపట్టారు.అరుణ యోగ రీసెర్చ్ అకాడమీ నుండి శిక్షకులు యశ్వంత్, సాయి రత్న జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులకు ధ్యానం, ప్రాణాయామం, యోగాసనాలు, సూర్య నమస్కారాలు మొదలైన అంశాల పైన శిక్షణ ఇవ్వడం జరిగింది.

 Yoga Training Culmination Program For Pd Pet Details, Yoga Training, Yoga, Zphs-TeluguStop.com

శిక్షణ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ జిల్లా విద్యాధికారి ఏ .రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ శిక్షణను పొందినటువంటి ఉపాధ్యాయులు వారి పాఠశాలలోని విద్యార్థులకు కాన్సన్ట్రేషన్, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి వాటిలో తర్ఫీదు ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారు.

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

తద్వారా విద్యార్థులు వారి అభ్యసన స్థాయిలను మెరుగు పరచుకోవచ్చని సూచించారు.యోగ గురువు అరుణ మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు.ఐదు రోజులపాటు జరిగిన శిక్షణలో మోడల్ స్కూల్/ కేజీబీవీ/జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల నుండి వ్యాయామ ఉపాధ్యాయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube