పుష్ప2 సాధించిన రికార్డును బ్రేక్ చేసే దమ్ముందా.. ఈ రికార్డ్స్ సులువు కాదంటూ?

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప 2( Pushpa 2 ) సినిమా పేరే ఎక్కువగా వినిపిస్తోంది.భారీ అంచనాల నడుమ విడుదలైన పుష్ప సినిమా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న సిని ఇండస్ట్రీల అందరి చూపు టాలీవుడ్ వైపే మళ్లేలా చేసింది.

 Tollywood Has Highest 1000 Cr Like Bahubali Rrr Kalki Pushpa 2 Movies In India D-TeluguStop.com

కేవలం ఆరు రోజుల్లోనే దాదాపుగా 1000 కోట్లు రాబట్టి అందరిని ఒకసారి షాక్ కు గురి చేసింది.ఇక ఇది ఇప్పట్లోనే కాదు.

ఎప్పటికీ చెరిగిపోని రికార్డ్ అని చెప్పవచ్చు.అయితే ముందు ముందు ఈ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించే సినిమాలు రావచ్చు కానీ, ఇంత తక్కువ సమయంలోనే అంత బాగా కలెక్షన్లు రాబట్టే సినిమాలు రావడం సాధ్యం కాదు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ప్రత్యేకంగా ఒక చాప్టర్ ను ఏర్పాటు చేసుకుంది.

Telugu Baahubali, Bahubali, Dangal, Jawan, Kalki, Kantara, Pathaan, Pushpa, Push

ఇక టాలీవుడ్‌కి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం అనేది కేక్ వాక్‌లా మారింది.బాలీవుడ్‌ ఈ ఫీట్‌ ను సాధించేందుకు చాలానే కష్టపడింది.ఒక్క దంగల్( Dangal ) తప్పా ఆ తరువాత వచ్చినవన్నీ బోల్తా కొట్టేశాయి.

ఇక షారుఖ్ అంతో ఇంతో బాలీవుడ్‌ ను నిలబెట్టేశాడు.పఠాన్, జవాన్ అంటూ అదరగొట్టేశాడు.

ఇక కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ వుడ్ తీసుకున్నా ఇంకా వెయ్యి కోట్ల పోస్టర్ అనేది కలగానే ఉంటుంది.శాండిల్ వుడ్‌ కు కేజీయఫ్( KGF ) తలమానికంగా ఉంటుంది.

అది మినహా అక్కడ ఇతర చిత్రాలేవీ కూడా కనీసం 500 కోట్ల క్లబ్బుల్లో చేరలేదు.రిషభ్ శెట్టి కాంతార( Kantara ) ఈ ఫీట్‌ ను మున్ముందు సాధించేలా ఉంది.

కోలీవుడ్ అయితే వెయ్యి కోట్లు కొల్లగొట్టాలని బాహుబలి టైం నుంచి ట్రై చేస్తోంది.కోలీవుడ్ బాహుబలి( Baahubali ) అంటూ పొన్నియన్ సెల్వన్‌ ను బాగా లేపారు.

Telugu Baahubali, Bahubali, Dangal, Jawan, Kalki, Kantara, Pathaan, Pushpa, Push

కానీ ఆ రెండు పార్టులు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి.రీసెంట్‌ గా కంగువాని లేపారు.అది కనీసం మూడు వందల కోట్లు కూడా రాబట్టలేకపోయింది.అసలు కోలీవుడ్ ఈ ఫీట్‌ను ఎప్పటికైనా అందుకుంటుందా? అని అంతా అనుకుంటున్నారు.టాలీవుడ్‌లో ఇప్పటి వరకు బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా రాబట్టాయి.ఇవన్నీ కూడా పది రోజు, పది హేను రోజులు తీసుకుని వెయ్యి కోట్లు కొల్లగొట్టాయి.

కానీ పుష్ప 2 మాత్రం కేవలం ఆరు రోజుల్లోనే ఈ ఫీట్‌ను సాధించి ఎప్పటికీ ఎవ్వరూ చెరపలేని రికార్డుని క్రియేట్ చేసింది.మరి మున్ముందు ఎవరైనా ఈ రికార్డుని బ్రేక్ చేయడానికి వస్తారో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube