పోడు భూములకు పట్టాలిచ్చిన గణత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది

రాజన్న సిరిసిల్ల జిల్లా : గత 60 ఎళ్ళనుంచి గిరిజనులు ఎదిరి చూస్తున్న పోడు భూముల కు పట్టాలిచ్చిన గణత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని రాజన్న సిరిసిల్ల జిల్లా విజ్ లెన్స్ కమిటీ సభ్యులు తిరుపతి నాయక్ , బిఆర్ ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సిత్యానాయక్ అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో బిఆర్ ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సిత్యానాయక్ ఆద్వర్యంలో శనివారం మధ్యాహ్నము ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

 Chief Minister Kcr Got The Amount Of Waste Lands, Chief Minister Kcr , Waste Lan-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు అజ్మీర తిరుపతి నాయక్ మాట్లాడుతూ అప్పటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజన సంక్షేమ కోసం ఏనాడు పట్టించుకోలేదని ఈనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తొమ్మిదేళ్ల పరిపాలన కాలంలో గిరిజనుల సంక్షేమ కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అదేనని ఆయన అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత గిరిజన విద్యావంతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరుశాతం నుంచి 10 శాతం వరకు రిజర్వేషన్లు పెంచారని ఈ సందర్భంగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పట్టాలు ఇవ్వడం పట్ల బిఆర్ ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సిత్యానాయక్ హర్షం వ్యక్తం చేశారు.

అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్లు ఆయన ప్రకటించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఫోడు భూముల పట్టాలతో పాటు గిరిజనులకు.

వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ , అదేవిధంగా రైతుబంధు,

రైతు బీమా వర్తింప చేస్తామని ప్రకటించడం పట్ల గిరిజన సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, గిరిజన సంక్షేమ సంఘాల ప్రతినిధులు గుండారం సర్పంచ్ లు భూక్యా శంకర్ నాయక్ , గుగులోత్ పెంటయ్య నాయక్, మాజీ సర్పంచ్ మాలోత్ పుణ్య నాయక్, భూక్య శ్రీరామ్ నాయక్, భూక్య కైలాస్ నాయక్, గూగుల్ సురేష్ నాయక్, అజ్మీరా రవి నాయక్ , అజ్మీర రాజు నాయక్, దేవుని గుట్ట సర్పంచ్ పెంటయ్య నాయక్, తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి కెసిఆర్ , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube