రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ( Oggu balaraju yadav )ఆధ్వర్యంలో మండలంలోని గొల్లపల్లి కుమ్మరి కుంట కు చెందిన వీర ముష్టి కులానికి చెందిన వారు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.తమకు బిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి లేదని వర్షాలు కొడితే ఇండ్లు నీళ్ళల్లో మునిగి తేలుతున్నాయని అయినా ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు.
ఇప్పటికీ గుడిసెలలో నివాసం ఉంటున్నామని వారు అన్నారు.
మాకు ఏ ఆపద వచ్చినా ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu balaraju yadav ) కు చెబితే మా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని బాలరాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ లో చేరడంతో ఆయన బాటలోనే నడుస్తామని అన్నారు.
ఈ చేరికల కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మ టి నర్సయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి( Saddi Lakshma Reddy ),గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ మర్రి నారాయణ రెడ్డి,అందే శేఖర్,పెంజర్ల సత్తయ్య యాదవ్, పందీర్ల లింగాగౌడ్, అడ్డగుల్ల శేఖర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తమ మద్దతు కేకే మహేందర్ రెడ్డి కే అని అన్నారు.