ఈ నెలాఖరులోగా పెండింగ్ పనులను పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈ నెలాఖరులోగా వీర్నపల్లి మండలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్ వీర్నపల్లి మండల కేంద్రంలో 1.6 కిలో మీటర్ల మేర ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతి నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.మోడల్ స్కూల్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ చాన్స్ పేరుతో ఇస్తున్న కంప్యూటర్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్( Anurag Jayanthi ) స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.అంతకుముందు వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామం లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.4 లక్షల 15 వేలతో, భావ్ సింగ్ తండా ప్రాథమిక పాఠశాలలో రూ.3 లక్షల 5 వేలతో చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన వాటర్ సంప్, త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ, తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు.వీర్నపల్లి మండల కేంద్రంలో 1.6 కిలో మీటర్ల మేర 12 మీటర్ల వెడల్పుతో ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో చేపట్టిన సిసి రోడ్డు ప్రాజెక్టు పై ఫోకస్ చేయాలని ఇంజనీర్ లను అదేశించారు.

 We Will Complete The Pending Works By The End Of This Month: District Collector-TeluguStop.com

ఇప్పటికే క్లియర్ గా ఉన్న 1.2 కిలో మీటర్ల మేర రోడ్డుకు సంబంధించి వారం రోజుల్లోగా డిస్ మాంటిల్, ఇరువైపులా విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్, వాటర్ వర్క్ లు సంబంధిత అధికారులు పూర్తి చేయాలన్నారు.ఆ వెంటనే ఆర్ అండ్ బి అధికారులు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.

రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఆర్డిఓ టి శ్రీనివాసరావుకు సూచించారు.కంచర్ల గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులు ఆశించిన వేగంగా జరగకపోవడంపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులు వేగంగా జరిగేలా చూడాలని అన్నారు.కంచర్ల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోనీ విద్యార్థులకు ఉద్దేశించిన టాయిలెట్ బ్లాక్ నిరుపయోగంగా ఉండడం, నరెగా కింద కొత్త టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి విద్యాశాఖ అధికారులు, ఎంపిడిఓ , ఉపాధి హామీ ఏపిఓ ప్రతిపాదనలు పంపక పోవడం పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి ఆమోదం తీసుకొని వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు కలెక్టర్ హుకుం జారీ చేశారు.

మన ఊరు మనబడి( Mana Ooru Mana Badi ) కార్యక్రమం కింద చేపట్టిన పనులను పక్షం రోజుల్లోగా పూర్తి చేయడంతో పాటు పనులు పూర్తయిన వెంటనే నిర్దేశిత పెయింటింగ్ పనులను కూడా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు.

చివరగా మోడల్ స్కూల్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ చాన్స్ పేరుతో ఇస్తున్న కంప్యూటర్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడారు.

కంప్యూటర్ శిక్షణ ఎట్లా ఉంది? అని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.భవిష్యత్తులో ఏమవ్వాలి అనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు.కంప్యూటర్ లేని ఉద్యోగం ఏదీ లేదని చెప్పిన జిల్లా కలెక్టర్….శిక్షణను సద్వినియోగం చేసుకుంటే అది విద్యార్థులకు భవిష్యత్తులో అన్ని విధాలుగా ఉపయోగపడుతుందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీర్నపల్లి మండలంలో రాష్ట్ర మంత్రి కే తారక రామారావు( Kalvakuntla Taraka Rama Rao ) ప్రత్యేకత అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు, విద్యార్థులకు సదుపాయాలను అందుబాటులోకి తెస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, జెడ్పీటీసీ గుగులోత్ కళావతి, ఎంపీపీ మాలోత్ భూలా, జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్, ఆర్&బి ఈఈ శ్యామ్ సుందర్, తహశీల్దార్ తఫాజుల్ హుస్సేన్, ఎంపీడీఓ నరేష్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ డీఈఈ సమ్మిరెడ్డి, ఏఈ నాగరాజు, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube