అమెరికా అధ్యక్ష ఎన్నికలు( US presidential election ) హోరాహోరీగా జరుగుతున్నాయి.ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్ ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరనే దానిపై ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.ఈ ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్ ట్రంప్‌లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ముందస్తు సర్వేలు, ఓపీనియన్ పోల్స్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడుతున్నట్లుగా తేలింది.ఇద్దరు నేతలు, రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా ఓ రేంజ్‌లో జరుగుతోంది.
తాజాగా కమలా హారిస్( Kamala Harris )ను టార్గెట్ చేస్తూ టెక్ దిగ్గజం గూగుల్‌పై విరుచుకుపడ్డారు డొనాల్డ్ ట్రంప్.కేవలం కమలకు చెందిన మంచి కథనాలు ట్రెండ్ అయ్యేలా గూగుల్ పక్షపాతం చూపిస్తోందని ఆయన ఆరోపించారు.తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ వ్యవహారంపై న్యాయశాఖతో విచారణ జరిపిస్తానని ట్రంప్ హెచ్చరించారు.అలాగే తనకు సంబంధించిన బ్యాడ్ కంటెంట్ డిస్‌ప్లే అయ్యే విధంగా ఓ వ్యవస్ధను గూగుల్ చట్టవిరుద్దంగా ఉపయోగించిందని ట్రంప్ ఆరోపించారు.
ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధమైన చర్య అని.ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు న్యాయశాఖ వారిని విచారిస్తుందని ఆయన ఆకాంక్షించారు.లేనిపక్షంలో అమెరికన్ చట్టాలకు లోబడి.తాను గెలిచిన వెంటనే గూగుల్‌పై ప్రాసిక్యూషన్‌కు అభ్యర్ధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
నాన్ ప్రాఫిట్ రైట్ వింగ్ ఆర్గనైజేషన్ అయిన ‘‘ది మీడియా రీసెర్చ్ సెంటర్ (ఎంఆర్‌సీ)( The Media Research Center ) ఇటీవల ప్రచురించిన కథనం ప్రకారం.వారు జరిపిన ఓ అధ్యయనంలో గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్స్‌లో ట్రంప్ కంటే కమలా హారిస్‌కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోందని పేర్కొంది.ఈ అధ్యయనాన్ని న్యూయార్క్ పోస్ట్, ఫాక్స్ న్యూస్ సహా ప్రముఖ మీడియా సంస్థలు నివేదించాయి.ఈ నివేదికపై గూగుల్ ప్రతినిధి ఒకరు స్పందించారు.ఎంఆర్సీ అధ్యయనంలో లోపాలు ఉన్నాయని, అధ్యక్ష అభ్యర్ధులిద్దరికీ తాము సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.