వైఎస్ కుటుంబంలో పెద్ద తుఫానే చెలరేగింది.ఆస్తుల వివాదంలో అటు వైఎస్ జగన్( YS Jagan ) ఇటు షర్మిల మధ్య మాటల వివాదం జరుగుతోంది .
ఒకరికొకరు లేఖలు రాసుకుంటూ మీడియాకెక్కిమరి విమర్శలు చేసుకుంటున్నారు.ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
అసలు కుటుంబాల మధ్య గొడవ ఎందుకని జగన్ ప్రశ్నిస్తుండగా , ఇది కుటుంబ గొడవ కాదని , ఒక తల్లి చెల్లికి జరిగిన అన్యాయం అంటూ టిడిపి కూడా ఈ విషయంలో విమర్శలు చేస్తోంది.మీడియా ముందుకు వచ్చి మరి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
జగన్ తరుపున వైసీపీ నాయకులు షర్మిలను టాబ్లెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు( Chandrababu Naidu ) మెప్పుకోసమే షర్మిల ఈ విధంగా చేస్తున్నారని వైసీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టు మరి విమర్శలు చేస్తున్నారు.
జగన్ ఓటమి చెంది రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఆస్తుల వివాదం ఆయనకు మరింత తలనొప్పిగా మారింది.వైయస్ కుటుంబంలో తలెత్తిన వివాదం రోజురోజుకు ముదురుతోంది.
అన్న చెల్లెల మధ్య ఇక ఏమాత్రం సఖ్యత లేదు అనే విషయం స్పష్టం అవుతోంది.ఈ విషయాన్ని జగన్ కూడా చెప్పేశారు. రాజకీయంగా తనను వ్యతిరేకించడమే కాకుండా వ్యక్తిగతంగా తనను తన కుటుంబం పై విమర్శలు చేయడంతో షర్మిల తో తెగ తెంపులు చేసుకోవడానికి జగన్ సిద్ధమైనట్లుగా అర్థమవుతుంది .వైఎస్ షర్మిల సైతం జగన్ కు దీటుగానే స్పందిస్తున్నారు.ఈ విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గనని తన వాటా తనుకు కావాల్సిందేనని, ఒక ఆడపడుచుకు అన్యాయం చేస్తావా అంటూ జగన్ను నిలదీస్తున్నారు .అయితే ఈ వ్యవహారంలో వైఎస్ విజయమ్మ( YS Vijayamma ) ఎటువైపు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది .
వైయస్ కుటుంబ సభ్యులు సైతం ఈ వివాదంలో కలుగజేసుకునే ప్రయత్నం చేయడం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరులు, చెల్లెళ్లు సైతం ఈ వ్యవహారానికి దూరంగానే ఉంటున్నారు.ఒకవైపు కొడుకు , మరోవైపు కూతురు ఎవరి వైపు నిలబడాలనే విషయంలో విజయమ్మ తేల్చుకోలేకపోతున్నారు .దీంతో ఈ వ్యవహారంలో ఆమె మౌనంగానే ఉండిపోతున్నారు .ఒకరికి మద్దతుగా మాట్లాడితే మరొకరిని పూర్తిగా దూరం చేసుకున్నట్లే.దీంతో ఈ విషయంలో ఆమె ఏమీ మాట్లాడలేని పరిస్థితి.
దీంతో లోటస్ పాండ్ లోనే ఉండి మానసిక వేదనకు గురవుతున్నట్లుగా వైస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు.