ఇటీవల ఒక వ్యక్తి తన కుక్కను విమానంలో( Dog on the plane ) తీసుకొని ఫ్లైట్ జర్నీని మొదలుపెట్టాడు.అయితే ఆ విమాన ప్రయాణంలో కొందరు చేసిన తప్పు వల్ల కుక్క చనిపోయిందని సదురు యజమాని చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
అంతే కాదు ఎయిర్‌లైన్స్‌పై ఒక కేస్ కూడా ఫైల్ చేశాడు.వివరాల్లోకి వెళ్తే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన మైకెల్ కాంటెల్లో అనే వ్యక్తి అలాస్కా ఎయిర్‌లైన్స్‌పై( Alaska Airlines ) కోర్టులో కేసు ఫైల్ చేశారు.
ఆయన కుక్క యష్ అనే ఫ్రెంచ్ బుల్‌డాగ్ న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న విమానంలో చనిపోయింది.దీనికి ఎయిర్‌లైన్సే కారణమని ఆయన ఆరోపిస్తున్నారు.
మైకెల్, ఆయన తండ్రి తమ రెండు కుక్కలకు ఎక్కువ స్థలం ఇచ్చి సౌకర్యంగా ప్రయాణించాలని ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు కొన్నారు.ప్రయాణానికి ముందు వెటర్నరీ డాక్టర్ కుక్కలు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
కానీ, అలాస్కా ఎయిర్‌లైన్స్ సిబ్బంది భద్రతా కారణాలతో వారిని వెనుక సీట్లకు మార్చమన్నారు.అయితే, విమాన ప్రయాణం సమయంలో యష్ ( Yash )అనే కుక్క చనిపోయింది.
విమానంలో సీటు మారినందుకు యష్ కుక్క చాలా ఇబ్బంది పడింది.అది సరిగ్గా శ్వాస తీసుకోలేకపోయింది.గాలి కోసం అల్లాడిపోయింది.విమానం ఎగిరి దిగే సమయంలో ఎయిర్‌లైన్స్ నిబంధనల ప్రకారం కాంటెల్లో తన కుక్కను చూసుకోలేకపోయాడు.శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, యష్ చనిపోయిందని తెలుసుకున్నారు.
అలాస్కా ఎయిర్‌లైన్స్‌పై 3 తప్పులు చేయడం వల్లే తనకుక్క చనిపోయిందని అతను చెబుతున్నాడు.ఆయన ప్రకారం ఫ్రెంచ్ బుల్‌డాగ్స్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.అలాంటి కుక్కలను విమానంలో తీసుకెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి.
కానీ, ఎయిర్‌లైన్స్ వాళ్ళు ఈ విషయం పట్టించుకోలేదు.కాంటెల్లో ఫస్ట్ క్లాస్ టిక్కెట్ కొన్నారు.
కానీ, ఎయిర్‌లైన్స్ వాళ్ళు ఆయన్ని వేరే సీటుకు మార్చేశారు.ఇది తప్పు అని ఆయన అంటున్నారు.
కుక్కలను ఎలా చూసుకోవాలో ఎయిర్‌లైన్స్ సిబ్బందికి తెలియదు అని ఆయన అంటున్నారు.నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.