నా ఇంట్లో నాగవంశీ ఫోటో పెట్టుకుంటాను.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్!

ఈ నెల 31వ తేదీన లక్కీ భాస్కర్ మూవీ ( Lucky Bhaskar Movie )థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ( Venky Atluri, Producer Nagavanshi ) భారీ సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

 Dulquer Salman Comments About Nagavamsi Photo Details Inside Goes Viral In Soci-TeluguStop.com

దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా ఈ హీరోకు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే.అయితే కొన్నిరోజుల క్రితం నాగవంశీ లక్కీ భాస్కర్ గురించి మాట్లాడుతూ తొలిరోజు ఈ సినిమా నుంచి 100 కోట్ల రూపాయలు ఆశిస్తున్నానని చెప్పారు.

నాగవంశీ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియా వేదికగా కూడా హాట్ టాపిక్ అయింది.దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ నాది 13 సంవత్సరాల కెరీర్ అని ఇప్పటివరకు 40 సినిమాలు చేశానని అన్నారు.100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడం నా కల అని దుల్కర్ కామెంట్లు చేశారు.లక్కీ భాస్కర్ సినిమాకు తొలిరోజే 100 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే మాత్రం నాగవంశీ ఫోటోకు ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటా అని దుల్కర్ తెలిపారు.

Telugu Crore Rupees, Dulquer Salman, Dulquersalman, Lucky Bhaskar, Nagavanshi, V

లక్కీ భాస్కర్ సినిమాకు ఈ నెల 30వ తేదీ రాత్రి నుంచి ఎంపిక చేసిన థియేటర్లలో ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు.లక్కీ భాస్కర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.లక్కీ భాస్కర్ సక్సెస్ సాధించడం దుల్కర్ కు సైతం కెరీర్ పరంగా కీలకమనే సంగతి తెలిసిందే.దుల్కర్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉంది.

Telugu Crore Rupees, Dulquer Salman, Dulquersalman, Lucky Bhaskar, Nagavanshi, V

లక్కీ భాస్కర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల పరంగా ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి.లక్కీ భాస్కర్ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలవుతూ ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube