ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు సోలో రిలీజ్ డేట్ కష్టమవుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు స్టార్ హీరోలకు పోటీ లేకపోయినా ఇతర భాషల నుంచి పోటీ ఎదురవుతోంది.
ప్రభాస్( Prabhas ) ది రాజాసాబ్( The Rajasaab ) మూవీ 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
ఈ సినిమాకు పోటీగా కమల్ హాసన్( Kamal Haasan ) థగ్ లైఫ్( Thug Life ) రిలీజ్ కానుందని తెలుస్తోంది.
ది రాజాసాబ్ మూవీ అన్ని భాషల్లో సోలో రిలీజ్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
కల్కి సినిమాలో( Kalki ) ప్రభాస్, కమల్ కలిసి నటించగా ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం గమనార్హం.థగ్ లైఫ్ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
థగ్ లైఫ్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

రాజాసాబ్ వర్సెస్ థగ్ లైఫ్ పోటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ప్రభాస్ కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్నా థగ్ లైఫ్ తో పోటీ వల్ల థియేటర్ల కౌంట్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది.తమిళనాడులో థియేటర్ల విషయంలో ది రాజాసాబ్ కు సమస్య ఎదురవుతుందని చెప్పవచ్చు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు ది రాజాసాబ్ సక్సెస్ సాధించడం కీలకమని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

ది రాజాసాబ్ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.ప్రభాస్ ఈ సినిమాలో ఏకంగా మూడు పాత్రలలో కనిపించనున్నారు.ది రాజాసాబ్ సినిమా సక్సెస్ సాధిస్తే ప్రభాస్ ఖాతాలో హ్యాట్రిక్ చేరుతుందని చెప్పవచ్చు.
ది రాజాసాబ్ సినిమా బాలీవుడ్ లో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.