త్రివిక్రమ్ సునీల్ 30 రూపాయల అనుభవం తెలుసా.. ఇన్ని కష్టాలు అనుభవించారా?

తెలుగు సిని ప్రేక్షకులకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Trivikram Srinivas Latest Comments About Sunil Viral On Social Media Details, Tr-TeluguStop.com

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తో( Allu Arjun ) చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం నటుడిగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సునీల్, డైరెక్టర్ త్రివిక్రమ్ రూమ్ మెట్స్ అనే సంగతి చాలా మందికి తెలిసిన విషయమే.అయితే ఈ విషయాన్ని వారిద్దరూ పలు సందర్భాలలో చెప్పారు.

Telugu Amount, Sunil, Lucky Bhaskar, Tollywood, Trivikramsunil-Movie

అలాగే త్రివిక్రమ్ సినిమాల ద్వారానే సునీల్( Sunil ) స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పవచ్చు.ఇప్పటికి త్రివిక్రమ్ సినిమాలలో సునీల్ కచ్చితంగా చిన్న క్యారెక్టర్ లో అయిన కనిపిస్తాడు.వీరిద్దరూ కలిసి రూమ్ లో ఉన్న సమయంలో ఎదురయ్యే కష్టాలని పలు సందర్భాలలో సునీల్ పంచుకున్నారు.ఇదిలా ఉంటే తాజాగా లక్కీ భాస్కర్( Lucky Bhaskar ) ప్రీరిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

లక్కీ భాస్కర్ మూవీ డబ్బు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో త్రివిక్రమ్ తన మనీ కష్టాల గురించి ఈ ఈవెంట్ లో పంచుకున్నారు.సునీల్, నేను లక్ డీకాపూల్ లో రూమ్ లో ఉన్న సమయంలో ఒక సంఘటన జరిగింది.

Telugu Amount, Sunil, Lucky Bhaskar, Tollywood, Trivikramsunil-Movie

చేతిలో 30 రూపాయిలు ఉన్న టైంలో హౌస్ ఓనర్ రూమ్ ఖాళీ చేయమని చెప్పారు.దీంతో నెక్స్ట్ తక్కువ మనీతో ఎలా అడ్జస్ట్ అవ్వాలా అని సునీల్ లెక్కలు వేసుకుంటున్నాడు.అయితే ఆ రోజులల్లో కోక్ టిన్ లు కొత్తగా మార్కెట్ లోకి వచ్చేసాయి.నేను 28 రూపాయిలు పెట్టి కోక్ టిన్ కొనేసాను.సునీల్ టెన్షన్ పడుతూ నెక్స్ట్ ఆ 30 రూపాయిలతో ఎలా మూడు రోజులు అడ్జస్ట్ అవ్వాలా అని లెక్కలు వేస్తే నువ్వొక రోజులోనే ఖర్చు చేసావ్ అని అన్నాడు.మూడు రోజుల తర్వాత ఎలా అని ఆలోచించే బదులు ఈ నైట్ నుంచే రేపు ఎలా బ్రతకాలో ఆలోచిద్దాం అని సునీల్ కి చెప్పానని త్రివిక్రమ్ శ్రీనివాస్ తన లైఫ్ లో మనీ కష్టాలు గురించి ఈవెంట్ లో పంచుకున్నారు.

గతంలో సునీల్ కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు ఈవెంట్ లో మెగాస్టార్ తో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు.త్రివిక్రమ్, సునీల్ 30 రూపాయిల అనుభవం నుంచి చాలా మంది జీవిత పాఠాలు నేర్చుకోవచ్చనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

అలా ఉన్న ఆ ఇద్దరు స్నేహితులు మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరు హీరోగా టాప్ కమెడియన్ గా రానిస్తుండగా మరొకరు టాప్ దర్శకులలో ఒకరిగా రాణిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube