ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు.
ఆనంద్ మహేంద్ర వింతలు, వినుత ఆవిష్కరణలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు.ఇకపోతే తాజాగా ఒక హైదరాబాద్ వ్యక్తి టాలెంటును కొని ఆడుతూ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
పెన్సిల్, షూ, షార్పనర్, పిజ్జా ఇలా రకరకాలుగా కార్లను తయారు చేస్తున్న వ్యక్తి గురించి ఆయన కొనియాడారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.

హైదరాబాద్ కు చెందిన సుధాకర్( Sudhakar ) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వెరైటీ కార్లను( Variety Cars ) తయారు చేస్తున్నారు.ఇలా పలు వినూత్న ఆకారాలలో తయారు చేసి ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు.ఈయన టాలెంట్ కు ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సొంతం చేసుకున్నారు.ఇక ఈ మ్యూజియంకు సంబంధించిన వివరాలతో ఆనంద్ మహేంద్ర ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.‘ఎంత చమత్కారమైనా తమ అభిరుచులను పట్టుదలతో కొనసాగించే వ్యక్తులు లేకపోతే ఈ ప్రపంచం ఆసక్తిగా ఉండదని,

ఈ వీడియోలో కనిపించే వాహనం చాలా చమత్కారంగా ఉందని తెలిపారు.ఇలాంటి కార్ల పట్ల ఏదైనా అభిరుచికి మేము మద్దతిస్తాం.నేను ఈసారి ఎప్పుడైనా హైదరాబాద్( Hyderabad ) పర్యటనకు వస్తే ఇక్కడికి వెళ్లడానికి ప్లాన్ చేస్తాను’ అని రాసుకొని వచ్చారు.ఈ వీడియోని చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూరు.“ఈ వెరైటీ కార్లు చాలా బాగున్నాయని” కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.“వావ్ వాట్ ఏ టాలెంట్ ” అంటూ మరికొందరు రాసుకొని వచ్చారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కార్స్ మ్యూజియం చూడడానికి వీలైతే ప్రయత్నించండి.







