రాజన్న సిరిసిల్ల జిల్లా: మత్స్యకారుల కుటుంబాల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.ఆదివారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో మిడ్ మానేరు పరిధిలోని వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో ఉచితంగా 80 వేల చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్యకారులకు 100% సబ్సిడీతో ఉచిత చేప బిల్లులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని యజ్ఞంల నిర్వహిస్తున్నారని తెలిపారు.ఈ నెల 4వ తేదీన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఎల్ఎండిలో చేప పిల్లల్ని విడుదల చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 53 కోట్ల చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.చేపలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్య కార్మికులకు ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.
మిడ్ మానేరు జలాశ పరిధిలోని రుద్రావరం గ్రామంలో గతంలో కేజీ కల్చర్ చేప పిల్లల పెంపకంపై అవగాహన కల్పించాం.
మత్స్యకారులు ముందుకు వస్తే సబ్సిడీ ద్వారా కేజీ కల్చర్ చేపల యూనిట్ మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.దానికి సరిపడా మార్కెటింగ్ అవకాశాలను కూడా కల్పిస్తామని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక ధార్మిక క్షేత్రంగా విరజిల్లుతుందని అన్నారు.మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నామని ఇప్పటికే వేములవాడలో 50 కోట్లతో యారన్ డిపో, రాజన్న ఆలయ అభివృద్ధికి 50 కోట్ల నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు.
మత్స్యకారులు అన్ని అవకాశాలను అందిపుచ్చుకోనికి ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.జిల్లా లోని 8642 మత్స్య కార్మిక కుటుంబాలకు చేతినిండా పని, ఆర్థికంగా ప్రగతిలోకి తీసుకువచ్చేందుకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో మిడ్ మానేరులో మొత్తం 14 లక్షల పైచిలుకు చేప పిల్లలను విడుదల చేయనున్నామని వెల్లడించారు.
ఇందులో భాగంగా మొదటి విడుతలో 80 వేల చేప పిల్లలను ఈ రోజు విడుదల చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్టీవో రాజేశ్వర్, జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, అర్బన్ తాసిల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.