రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిమండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారితో కలసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రుద్రంగి గ్రామంలోని అంతర్గత రహదారుల సిసి రోడ్డు నిర్మాణానికి 40 లక్షలతో, కస్తూర్బా పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి 7.50 లక్షలతో,
రెండవ స్మశాన వాటికకు 13.50 లక్షలతో, రుద్రంగి నుండి దసరా నాయక్ తండాకు వెళ్లే రహదారి సీసీ రోడ్డు నిర్మాణనికి 28 లక్షలతో శంకుస్థాపన చేశారు.కస్తూర్బా పాఠశాలలోని విద్యార్థులతో ప్రభుత్వ విప్ కాసేపు ముచ్చటించారు.
సరైన వసతులు ఉన్నాయ అని అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు.