ఎల్లమ్మ గుడి ఆవరణలో పొట్టిరకం తాటి హైబ్రిడ్ విత్తనాలు నాటిన గౌడ సంఘం సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ఎల్లమ్మ గుడి ( Ellamma temple )ఆవరణలో పొట్టిరకం తాటి హైబ్రిడ్ విత్తనాలు గ్రామ సర్పంచ్ బాగ్యలక్ష్మి -బాలరాజు, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్యయాదవ్, ఉప సర్పంచ్ సాధుల్, ఎఎంసి చైర్మన్ మామిడి సంజీవ్,వార్డు మెంబర్లు మామిడి తిరుపతి గౌడ సభ్యులు కలిసి నాటారు.ఈ మొక్కలను బీహార్ నుండి రాష్ట్ర ప్రణాళికా సంఘము అధ్యక్షులు బోయినపల్లి వినోదకుమార్ తెప్పించి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని గ్రామల గౌడ సంఘ సబ్యులకు పంపిణీ చేయిస్తున్నారని ఎంపీటీసీ నర్సయ్యయాదవ్ అన్నారు.

 Members Of The Gowda Community Planted Short Palm Hybrid Seeds In The Premises O-TeluguStop.com

ఇవి 14 ఫీట్స్ వరకు పెరుగుతాయని 4 సంవత్సరాలలో గీతకు వస్తాయని గీతకార్మికులకు చెట్టు నుండి పడిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుందని గ్రామ సర్పంచ్ బాగ్యలక్మి-బాలరాజు అన్నారు.ఈ చెట్లు చాలా సౌలభ్యంగ ఉన్నవాని ఎఎంసి చైర్మన్ మామిడి సంజీవ్ అన్నారు.

గౌడ సంఘ అధ్యక్ష ఉపాధ్యక్షులు కొయ్యడ రాజయ్య అంతటి శ్రీనివాస్ , సంఘ సభ్యులు బోయినిపల్లి వినోదకుమార్ కి కృతగ్యతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కోశాధికారి బండారి శ్రీనివాస్, డైరెక్టర్లు ముంజ భాస్కర్, ముంజ భూపతి , మాజీ సంఘము అధ్యక్షులు అంతటి రాజయ్య , అంతటి బాలయ్య , గౌడ సంఘ సభ్యులు గైని మల్లేశం, బొంగోని చంద్రం, సూదగోని నాగేంద్రం, అంతటి సత్యం, కొయ్యడ సత్యనారాయణ, బండారు నర్సయ్య , కొయ్యడ చెందు, అంతటి లింగమూర్తి, అంతటి రమేష్ , బండారి దేవయ్య , తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube