ఎల్లమ్మ గుడి ఆవరణలో పొట్టిరకం తాటి హైబ్రిడ్ విత్తనాలు నాటిన గౌడ సంఘం సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ఎల్లమ్మ గుడి ( Ellamma Temple )ఆవరణలో పొట్టిరకం తాటి హైబ్రిడ్ విత్తనాలు గ్రామ సర్పంచ్ బాగ్యలక్ష్మి -బాలరాజు, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్యయాదవ్, ఉప సర్పంచ్ సాధుల్, ఎఎంసి చైర్మన్ మామిడి సంజీవ్,వార్డు మెంబర్లు మామిడి తిరుపతి గౌడ సభ్యులు కలిసి నాటారు.

ఈ మొక్కలను బీహార్ నుండి రాష్ట్ర ప్రణాళికా సంఘము అధ్యక్షులు బోయినపల్లి వినోదకుమార్ తెప్పించి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని గ్రామల గౌడ సంఘ సబ్యులకు పంపిణీ చేయిస్తున్నారని ఎంపీటీసీ నర్సయ్యయాదవ్ అన్నారు.

ఇవి 14 ఫీట్స్ వరకు పెరుగుతాయని 4 సంవత్సరాలలో గీతకు వస్తాయని గీతకార్మికులకు చెట్టు నుండి పడిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుందని గ్రామ సర్పంచ్ బాగ్యలక్మి-బాలరాజు అన్నారు.

ఈ చెట్లు చాలా సౌలభ్యంగ ఉన్నవాని ఎఎంసి చైర్మన్ మామిడి సంజీవ్ అన్నారు.

గౌడ సంఘ అధ్యక్ష ఉపాధ్యక్షులు కొయ్యడ రాజయ్య అంతటి శ్రీనివాస్ , సంఘ సభ్యులు బోయినిపల్లి వినోదకుమార్ కి కృతగ్యతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కోశాధికారి బండారి శ్రీనివాస్, డైరెక్టర్లు ముంజ భాస్కర్, ముంజ భూపతి , మాజీ సంఘము అధ్యక్షులు అంతటి రాజయ్య , అంతటి బాలయ్య , గౌడ సంఘ సభ్యులు గైని మల్లేశం, బొంగోని చంద్రం, సూదగోని నాగేంద్రం, అంతటి సత్యం, కొయ్యడ సత్యనారాయణ, బండారు నర్సయ్య , కొయ్యడ చెందు, అంతటి లింగమూర్తి, అంతటి రమేష్ , బండారి దేవయ్య , తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో కొత్త ఇల్లు కడుతున్న అల్లు అర్జున్.. ఏకంగా అలాంటి సౌకర్యాలతో?