చైనాలో( China ) చిన్నపిల్లల సంఖ్య విపరీతంగా తగ్గుతోంది.ఫలితంగా ఈ దేశంలో వేలాది కిండర్‌గార్టెన్ స్కూళ్లు( Kindergarten ) మూతపడుతున్నాయి.
చైనాలో పుట్టే పిల్లల సంఖ్య చాలా తగ్గిపోతోంది కాబట్టి 2023లోనే దాదాపు 15 వేల కిండర్‌గార్టెన్లు మూతబడ్డాయి.ఈ సంఖ్య గత సంవత్సరం కంటే చాలా ఎక్కువ.
కిండర్‌గార్టెన్లలో చేరే పిల్లల సంఖ్య సైతం మూడు సంవత్సరాలుగా తగ్గుతూనే ఉంది.గత సంవత్సరం ఒక్కటే దాదాపు 50 లక్షల మంది పిల్లలు కిండర్‌గార్టెన్లలో చేరలేదు.
2023లోనే 14,808 కిండర్ గార్టెన్లు క్లోజ్ అయ్యాయి, మొత్తం 274,400కి వీటి సంఖ్య తగ్గింది.2023లో చైనాలో ప్రైమరీ స్కూల్స్( China Primary Schools ) సంఖ్య కూడా 5,645 తగ్గి 143,500కి పడిపోయింది, ఇది 3.8% తగ్గుదల.మానవ జనన రేటు తగ్గడం వల్ల చైనా జనాభా( China Population ) కూడా తగ్గుతోంది.చైనాలోని మొత్తం జనాభా 140 కోట్లకు తగ్గింది.2023లో తొమ్మిది మిలియన్ల పిల్లలు మాత్రమే జన్మించారు, ఇది 1949 తర్వాత అతి తక్కువ జనన రేటుగా నమోదయింది.ఇంతకుముందు ఈ డ్రాగన్ కంట్రీలో వృద్ధులు ఎక్కువగా ఉండగా ఇప్పుడు మరింత ఎక్కువ అయ్యారు.రిపోర్ట్స్ ప్రకారం, ఈ దేశంలో ప్రస్తుతం 30 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు.2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు చేరుతుందని అంచనా.
చైనాలో చాలా కిండర్‌గార్టెన్లు ఇప్పుడు వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుతున్నాయి.చైనాలో వృద్ధుల సంఖ్య చాలా పెరిగిపోయింది.అందుకే చాలామంది కిండర్‌గార్టెన్ ఉపాధ్యాయులు వృద్ధులను చూసుకోవడానికి వెళ్తున్నారు.
ఇంతకు ముందు చైనాలో ఒక కుటుంబానికి ఒకే ఒక్క బిడ్డను( One-Child Policy ) కనాలనే నియమం ఉండేది.ఆ తర్వాత ఈ నియమాన్ని మార్చి, ఒక కుటుంబానికి ఇద్దరు పిల్లలు కనడానికి అనుమతించారు.
కానీ ఇది పెద్దగా పనిచేయలేదు.అందుకే తర్వాత మూడుగురి వరకు పిల్లలు కనడానికి అనుమతి ఇచ్చారు.
వృద్ధులను చూసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది.అందుకే చైనా ప్రభుత్వం వృద్ధాప్య నివృత్తి వయస్సు పెంచాలని నిర్ణయించింది.