ఒడిశా రాష్ట్రంలో( Odisha ) ప్రస్తుతం దానా తుఫాన్( Dana Cyclone ) సృష్టిస్తున్న భీభత్సం అంతాఇంతా కాదు.అయితే తుఫాన్ భీభత్సం సృష్టిస్తున్నా ఒక ఆంబులెన్స్ డ్రైవర్( Ambulance Driver ) మాత్రం అనారోగ్యంతో బాధ పడుతున్న మహిళను 2 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాడు.
ఆంబులెన్స్ డ్రైవర్ కష్టం వృథా పోలేదు.ఆ మహిళ ప్రాణాలను కాపాడటంలో ఆంబులెన్స్ డ్రైవర్ సక్సెస్ అయ్యాడు.
ఆ ఆంబులెన్స్ డ్రైవర్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేంద్రపడా జిల్లాలో ఉన్న మారుమూల గ్రామంలో ఒక మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోందని ఆంబులెన్స్ డ్రైవర్ కు తెలియగా వర్ష భీభత్సం వల్ల రోగి ఇంటి వరకు ఆంబులెన్స్ చేరుకోలేదు.
ఆంబులెన్స్ డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి మహిళ ఇంటి వరకు వెళ్లడం జరిగింది.ఆ తర్వాత 2 కిలోమీటర్లు మహిళను మోసుకుని వచ్చి ఆంబులెన్స్ వద్దకు చేర్చారు.

ఆంబులెన్స్ లో ఉన్న వైద్య సిబ్బంది ఆమెకు అత్యవసర వైద్య చికిత్సను అందించారు.ఈ ఆంబులెన్స్ డ్రైవర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ ఆంబులెన్స్ డ్రైవర్ కు సెల్యూట్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి ఆంబులెన్స్ డ్రైవర్లు అరుదుగా ఉంటారని నెటిజన్లు చెబుతున్నారు.ఈ డ్రైవర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రైవర్ కు ఏదైనా అవార్డును ప్రకటిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ డ్రైవర్ లాంటి వ్యక్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి డ్రైవర్లు చాలా అరుదుగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.2 కిలోమీటర్లు అనారోగ్యంతో ఉన్న మనిషిని మోసుకొని వెళ్లడం ఏ మాత్రం సాధారణమైన విషయం అయితే కాదనే సంగతి తెలిసిందే.ఆంబులెన్స్ డ్రైవర్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుండటం గమనార్హం.







