ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అభిమానులు పుష్ప2( Pushpa 2 ) సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.
ఇటీవల మేకర్ నేషనల్ ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా రెండు సినిమా ఈవెంట్లను నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
అయితే తాజాగా ఈ వేడుకలకు బ్రేక్ పడిందనే చెప్పాలి.హైదరాబాద్లో నేటి నుంచి నెలరోజుల పాటు అనగా నవంబర్ 28వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
ఈ విధంగా తెలంగాణలో 144 సెక్షన్ అమలులో ఉంది అంటే ఎలాంటి బహిరంగ సభలు రాస్తారోకోలు ధర్నాలు చేయకూడదు.అలాగే ప్రజలు ఎక్కడ గూమికూడి ఉండకూడదు.ఇలా ఐదు మందికి మించి ఒకచోట ఉంటే చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.ఈ తరుణంలోనే సినిమా వేడుకలకు కూడా పోలీస్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లభించదని తెలుస్తుంది.
దీంతో పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ( Pre Release ) వేడుక ఉండదని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇక నవంబర్ 28వ తర్వాత సినిమా వేడుకను నిర్వహించడానికి పోలీసుల నుంచి అనుమతి వస్తే నిర్వహిస్తారు అయితే పోలీసులు ఓపెన్ గ్రౌండ్లో వేడుక చేయడానికి అనుమతి ఇస్తారా లేకపోతే దేవర సినిమా లాగా చేస్తారా అనే ఆందోళనలో అభిమానులు ఉన్నారు.ఇక ఏపీలో ఈ సినిమా వేడుకను నిర్వహించడానికి ఇక్కడ ప్రభుత్వం కూడా అనుమతి తెలుపుతుందా లేదా అనేది తెలియదు ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లారు.తద్వారా ఈ సినిమా వేడుకలకు ఏపీలో అనుమతులు లభిస్తుందా లేదా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.